పెద్ద పెద్ద మాటలొద్దు.. బెస్ట్ ఎవరు ఆడితే వాళ్ళే గెలవాలి!
on Nov 22, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో అభయ్ నవీన్ ఫస్ట్ మూడు వారాలు ఇరగదీశాడు. ఇక టాస్క్ లలో తను బయాజ్ గా ఉన్నాడంటు ఏకంగా బిగ్ బాస్ నే తిట్టడంతో రెడ్ కార్డ్ తీసుకొని మరీ బయటకొచ్చాడు. హౌస్ లో అభయ్ నవీన్ ఉన్నన్ని రోజులు అతనే విన్నర్ అనుకున్నారంతా కానీ చివరి వారం అతనికి బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఇక గత ఆరు వారాల నుండి సాగుతున్న కన్నడ గ్రూపిజం గురించి అభయ్ నబీన్ మొదటిసారి నోరు విప్పాడు.
అభయ్ నవీన్ తన ఇన్ స్టాగ్రామ్ లో తెలుగు వర్సెస్ కన్నడ వివాదంపై ఓ వీడియో పెట్టాడు. నేను నిఖిల్, ప్రేరణలకి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు వచ్చే మాక్సిమమ్ మెసేజ్‌లన్నీ తెలుగోడివి అయి ఉండి తెలుగోళ్లని ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. అన్నా ఫస్ట్ వారాల్లో ఎలిమినేటర్ అయినోళ్లంతా తెలుగోళ్లే మరి.. అప్పుడు మీరంతా ఎక్కడికి పోయారన్నా.. మీ సపోర్ట్ ఏడికి పోయింది.. మీరెవరికి ఓటేశారు.. ఎందుకు అదంతా జరిగింది.. ఇప్పుడెందుకు వస్తుందన్నా.. ఏదైనా మంచి మంచి అకేషన్లు ఉన్నప్పుడేమో మేమంతా ఇండియన్స్.. భారతీయులుగా గర్వపడుతున్నాం అంటాం.. కానీ ఇలా స్టేట్‌కి దీనికి సంబంధించిన విషయం అయితే నా రాష్ట్రం, నా ప్రాంతం, నా కులం, నా ఊరు అంటూ సెపరేట్ చేసుకుంటూ పోతామా అన్న అని అభయ్ నవీన్ అన్నాడు.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు.. తెలుగోళ్లు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు.. అది మాత్రం మనందరికీ ఉన్న గొప్ప గుణం.. అందుకే తెలుగు సినిమాల్లో పక్క భాషల యాక్టర్స్ చాలా చాలా మంది పని చేస్తుంటారు.. అందుకు ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నా.. ఇది కేవలం ఒక గేమ్ అంతే.. గేమ్‌లో అవన్నీ తీసుకురాకండి.. బెస్ట్ ఎవడు ఆడితే వాడు గెలవని.. నాకు నచ్చినోళ్లని సపోర్ట్ చేయమని నేను అనను.. మీకు నచ్చినోళ్లని చేసుకోండి.. ఎవడు మంచిగా ఆడితే వాడు గెలవనీ అన్నా..అంటూ అభయ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఇష్యూ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read